Hyderabad, ఆగస్టు 16 -- గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. చంద్రుడు కూడా కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తాడు. చంద్రుడుని లక్ష్మీదేవిగా భావిస్తారు. జాతకంలో లేదా గ్రహ సంచారంలో చంద్రుడు బలంగా ఉన్నట్లయితే సంతోషంగా ఉంటుంది, ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

ఈ నెల 17 నుంచి 19 దాకా చంద్రుడు వృషభ రాశిలో సంచారం చేస్తాడు. ఇది కొన్ని రాశుల వరకే శుభ ఫలితాలను తీసుకువస్తుంది. మరి చంద్రుడి వృషభ రాశి సంచారం ఏ రాశుల వారికి కలిసి వస్తుంది? ఎవరు ఎలాంటి లాభాలు పొందుతారు? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి వారికి చంద్రుని సంచారం మంచి ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి ఆర్థికపరంగా బాగుంటుంది. షేర్లు, వడ్డీ, వ్యాపారాలు ద్వారా ఎక్కువ లాభాలు పొందుతారు. సుఖసంతోషాలతో ఉంటారు. శుభకార్యాలు కూడా జరిగే అవకా...