భారతదేశం, జనవరి 3 -- ఓటీటీ తెలుగు సూపర్ హిట్ వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. 2025లో ఈటీవీ విన్ లోకి వచ్చిన ఈ మిస్టరీ క్రైమ్ హారర్ థ్రిల్లర్ అదరగొట్టింది. అనూహ్యమైన రెస్పాన్స్ దక్కించుకుంది. ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్ సీజన్ 1లో థ్రిల్ ఆడియన్స్ ను ఊపేసింది. ఇప్పుడు ఈ సిరీస్ కానిస్టేబుల్ కనకం సీజన్ 2 వచ్చేస్తోంది. ఇవాళ (జనవరి 3) ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.

తెలుగు మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం సీజన్ 2 వచ్చేస్తోంది. జనవరి 8 నుంచి ఈటీవీ విన్ లో ఈ సీజన్ 2 స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ సీజన్ 2 ట్రైలర్ ను శనివారం మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో చంద్రిక బతికే ఉందని కనకం చెప్పడం హైలైట్ గా నిలిచింది. సీజన్ 2లోనూ అదే ఉత్కంఠ, సస్సెన్స్, థ్రిల్ కొనసాగించారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

కానిస్టేబుల్ కనకం ...