Hyderabad, సెప్టెంబర్ 20 -- బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కుమారుడుగా సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు చంద్రహాస్. తన ప్రవర్తనతో ఆటిట్యూడ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న చంద్రహాస్ వరుస చిత్రాలతో ఆడియెన్స్‌ను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. తాజాగా చంద్రహాస్ నటించిన సినిమా కాయిన్.

శ్రీకాంత్ రాజారత్నం నిర్మాతగా నిర్మించిన కాయిన్ సినిమాకు జైరామ్ చిటికెల దర్శకత్వం వహించారు. అయితే, ఇటీవల చంద్రహాస్ పుట్టిన రోజు సందర్భంగా కాయిన్ మూవీ గ్లింప్స్, టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన ఈవెంట్‌లో డైరెక్టర్ జైరామ్ చిటికెల ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.

దర్శకుడు జైరామ్ చిటికెల మాట్లాడుతూ .. "మా కోసం వచ్చిన సాయి రాజేష్ అన్నకి థాంక్స్. ఐదు రూపాయల కాయిన్ ఎందుకు బ్యాన్ అయింది? అనే నేపథ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను. మున్ముందు ఈ మూ...