భారతదేశం, మే 22 -- మద్యం కేసుల్లో అక్రమాలకు పాల్పడిన కేసులో బెయిల్‌పై ఉన్న చంద్రబాబు తమ మీద తప్పుడు కేసులు పెడుతున్నారని, గతంలో చేసిన అక్రమాలను జస్టిఫై చేసుకుంటూ అక్రమాలను కొనసాగించడానికి కేసులు పెడుతున్నారని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకోడానికి కేసులు పెడుతున్నారని, జూన్ 4న ఏపీలో వెన్నుపోటు దినంగా నిరసనలకు పిలుపునిచ్చారు.

వైఎస్సార్సీపీ జగన్‌కు పోరాటాలు కొత్త కాదని, అప్పట్లో అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇబ్బందులు పెడితేనే వైఎస్సార్సీపీ పార్టీ పుట్టిందని గుర్తు చేశారు. చంద్రబాబు కేసులు కప్పి పుచ్చేందుకు ఈ కేసులు పెట్టారని ఆరోపించారు. భేతాళ విక్రమార్క కేసులతో ఏమి జరగదన్నారు. చంద్రబాబుకు మొట్టికాయలు తప్పవన్నారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామన్న చంద్రబాబు, షాపులు మొ...