భారతదేశం, మే 17 -- చంద్రబాబు, లోకేష్‌ పులి మీద స్వారీ చేస్తున్నారు.. స్వారీ ఆపగానే ఆ పులి ఇద్దరినీ మింగేస్తుంది.. అని మాజీమంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్‌ రెడ్డి అరెస్ట్‌ల వెనుక రాజకీయ కుట్ర కోణం ఉందని ఆరోపించారు. చంద్రబాబు చేతుల్లో పోలీస్‌ వ్యవస్థ బందీగా మారిందని విమర్శించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీ గెలవడం ఖాయమన్న అంబటి.. ప్రతి అక్రమ అరెస్టుకు సమాధానం చెప్తామని స్పష్టం చేశారు. అక్రమ కేసులకు భయపడేది లేదన్నారు.

'ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేష్ స‌క‌ల శాఖ‌ల మంత్రిగా కొత్త అవ‌తారం ఎత్తారు. త‌న‌కు సంబంధం లేని మంత్రిత్వ శాఖ‌ల్లో లోకేష్ త‌ల‌దూర్చి అన్నీ తానై వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. దొంగ సాక్ష్య...