భారతదేశం, మే 9 -- భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం చండీగఢ్, పాటియాలాలో వైమానిక దాడుల సైరన్లు మోగాయి. 3 సైనిక స్థావరాలపై పాక్ జరిపిన క్షిపణి, డ్రోన్ దాడిని భారత్ భగ్నం చేసిన కొద్ది గంటల్లోనే ఈ హెచ్చరికలు వెలువడ్డాయి. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, బాల్కనీలకు దూరంగా ఉండాలని చండీగఢ్ డిప్యూటీ కమిషనర్ నిశాంత్ కుమార్ యాదవ్ సూచించారు. చండీగఢ్ లో గురువారం సాయంత్రం నుంచి బ్లాక్ అవుట్ పాటించారు.

దాడి జరిగే అవకాశం ఉందని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి ఎయిర్ వార్నింగ్ వచ్చింది. సైరన్ మోగిస్తున్నారు. అందరూ ఇళ్లలోనే ఉండాలని, బాల్కనీలకు దూరంగా ఉండాలని చండీగఢ్ డీసీ పేర్కొన్నారు. పాటియాలా వాసులు ఇళ్లలోనే ఉండాలని, ప్రశాంతంగా ఉండాలని సూచించారు. జిల్లాలో అన్ని విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్ద...