భారతదేశం, జూన్ 12 -- గుజరాత్ లోని అహ్మదాబాద్ సమీపంలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్నట్లుగా భావిస్తున్న విమానం టేకాఫ్ తీసుకున్న కాసేపటికే కుప్పకూలింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సాంకేతిక కారణంతోనే విమానం కుప్పకూలినట్లు తెలుస్తోంది. అయితే, అది ఏ ఎయిర్ లైన్స్? అందులో ఎంతమంంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు? అనే విషయాలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ సుమారు 242 మంది ప్రయాణికులు ఉండవచ్చని తెలుస్తోంది. ఆ విమానం లండన్ వెళ్తోంది. టేకాఫ్ తీసుకున్న కాసేపటికే కుప్ప కూలింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. సమాచారం తెలియగానే అక్కడికి చేరుకున్న అధికారులు సహాయ చర్యలు ప్రారంభించారు. 12 అగ్ని మాపక వాహనాలు అక్కడికి చేరుకున్నాయి.

Published by HT Digital Content Services with permission...