భారతదేశం, ఫిబ్రవరి 9 -- దక్షిణ మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో దాదాపు 41 మంది మరణించారు. 48 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు హైవేపై ట్రక్కను ఢీకొట్టింది. ఢీకొన్న తర్వాత బస్సు మంటల్లో చిక్కుకుని 41 మంది మృతి చెందారు. బస్సు కాలి బూడిదైంది. ఘటన గురించి తెలిసిన పోలీసులు ప్రమాద స్థలానికి వచ్చారు. ప్రమాదం నుంచి బయటపడిన ఏడుగురిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

బస్సు కాన్కున్ నుండి టబాస్కోకు వెళుతోంది. ట్రక్కను ఢీ కొట్టిన తర్వాత మంటలు చెలరేగాయి. ప్రమాదం గురించి టబాస్కో రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. బస్సు పూర్తిగా కాలిపోయిందని ప్రకటించింది. ట్రక్కును ఢీకొన్న తర్వాత మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం శనివారం ఉదయం ఎస్కార్సెగా నగరానికి సమీపంలో జరిగింది. ప్రమాదంలో మరణించిన వారిని గుర్తించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రమాదం నుంచి బయ...