భారతదేశం, జనవరి 8 -- తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోకిల పరిధిలో మీర్జాగూడ వద్ద కారు చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఘటనలో నలుగురు విద్యార్థులు మృతి చెందారు. వీరిలో ముగ్గురు విద్యార్థులు ఐసీఎఫ్ఏఐ వర్సిటీకి చెందినవారు, మరొకరు ఎంజీఐటీ విద్యార్థిగా గుర్తించారు. మృతుల పేర్లు సూర్యతేజ, సుమిత్, శ్రీనిఖిల్, రోహిత్. హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....