భారతదేశం, జూన్ 12 -- గుజరాత్ లోని అహ్మదాబాద్ సమీపంలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఏఐ 171 విమానం టేకాఫ్ తీసుకున్న కాసేపటికే కుప్పకూలింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తాజా సమాచారం మేరకు, ప్రమాదానికి గురైన విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారని తెలుస్తోంది. అయితే, ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

సాంకేతిక కారణంతోనే విమానం కుప్పకూలినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో సిబ్బంది కాకుండా, 230 మంది ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది. ఆ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న బోయింగ్ 787 - 8 డ్రీమ్ లైనర్ గా అని ఎయిర్ ఇండియా ప్రకటించింది.. టేకాఫ్ తీసుకున్న కాసేపటికే ఆ ఎయిర్ ఇండియా విమానం ఏర్ పోర్ట్ సమీపంలోనే కుప్ప కూలింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పెద...