భారతదేశం, నవంబర్ 15 -- మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు నటిస్తున్న మూవీ గ్లోబ్‌ట్రాట‌ర్ (వర్కింగ్ టైటిల్). ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఈవెంట్ ను ఇవాళ (నవంబర్ 15) హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ పాస్ ల కోసం భారీ డిమాండ్ నెలకొంది. చాలా మంది అభిమానులకు పాస్ లు దక్కలేదు.

గ్లోబ్‌ట్రాట‌ర్ ఈవెంట్ ను భారీ స్థాయిలో నిర్వహించబోతున్నారు. దీని కోసం పాస్ లను స్పెషల్ గా స్‌పోర్ట్‌ల మాదిరిగా డిజైన్ చేయించారు. సోషల్ మీడియాలో రాజమౌళి ఈవెంట్ ప్రవేశం పరిమితంగానే ఉంటుందని స్పష్టం చేశారు. ఈవెంట్ హోస్టింగ్‌ను సరికొత్త స్థాయికి తీసుకెళ్తూ ఎంట్రీ పాస్‌లకు బదులుగా పాస్‌పోర్ట్‌లను జారీ చేశారు. వీటి చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

ఏదైనా మూవీ ఈవెంట్ ను టీవీ ఛానెల్...