భారతదేశం, నవంబర్ 13 -- మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో భారీ ప్రాజెక్ట్ రెడీ అవుతోంది. దీనికి ఎస్ఎస్ఎంబీ29, గ్లోబ్‌ట్రాట‌ర్ అనే వర్కింగ్ టైటిల్స్ ఉన్నాయి. గ్లోబ్‌ట్రాట‌ర్ పేరుతో నవంబర్ 15న హైదరాబాద్ లో ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఇందులో మూవీ పేరు, మహేష్ బాబు ఫస్ట్ లుక్ రివీల్ చేస్తారని తెలుస్తోంది. ఈ ఈవెంట్ సందర్భంగా ఫ్యాన్స్ ను రిక్వెస్ట్ చేస్తూ రాజమౌళి గురువారం (నవంబర్ 13) ఓ వీడియో రిలీజ్ చేశారు.

''అందరికీ నమస్కారం. మన గ్లోబ్‌ట్రాట‌ర్ ఈవెంట్ కోసం మీరందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని తెలుసు. నేను కూడా ఎగ్జైటింగ్ ఉన్నా. మన ఈవెంట్ బాగా జరగాలంటే మీ అందరి సహకారం చాలా అవసరం. మన ఈవెంట్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా, మన సేఫ్టీ దృష్ట్యా పోలీస్ డిపార్ట్ మెంట్ వాళ్లు చాలా స్ట్రిక్ట్ ఇన్ స్ట్రక్షన్స్ పాస్ చేశారు. అవన్నీ కూడా మనం కచ్చి...