భారతదేశం, జూలై 26 -- అమెరికాకు చెందిన బిజినెస్ ఇంటెలిజెన్స్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ తాజా డేటా ప్రకారం 75 శాతం అప్రూవల్ రేటింగ్ సాధించి అత్యంత ప్రజాదరణ పొందిన ప్రజాస్వామిక నేతగా ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు. సర్వేలో పాల్గొన్న వారిలో 75 శాతం మంది ప్రధాని మోదీని సానుకూల రేటింగ్ ఇవ్వగా, 7 శాతం మంది ఎటూ తేల్చుకోలేదని, 18 శాతం మంది వ్యతిరేకించారు.

మోదీ తర్వాత రెండో స్థానంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్, మూడో స్థానంలో అర్జెంటీనా జేవియర్ మిలీ ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కేవలం 44 శాతం ఆమోదనీయతతో ఎనిమిదో స్థానంలో ఉన్నారు. వాణిజ్య సుంకాలు, వివాదాస్పద దేశీయ చర్యలు వంటి కొన్ని విధాన నిర్ణయాలు ఆయన ప్రజాదరణ తగ్గడానికి దోహదం చేసి ఉండవచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు.

అంతర్జాతీయంగా అత్యధిక ఆమోదనీయత కలిగిన నేతగా ప...