భారతదేశం, జూన్ 11 -- డెట్రాయిట్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి చెందిన 350 కి పైగా తెలుగు కుటుంబాలు ఫార్మింగ్టన్ హిల్స్‌లోని శియావాసీ పార్క్‌లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ డెట్రాయిట్ ఛాప్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఉల్లాసభరిత పల్లెవంట కార్యక్రమంలో పాల్గొన్నాయి. ప్రవాసుల్లో ఐక్యతా భావనను, ఆనందాన్ని పెంపొందించేలా ఈ కార్యక్రమం కొనసాగింది.

ఈ వేడుక ద్వారా తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ 11వ వార్షికోత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహించారు. చిన్నాపెద్దలంతా సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, గేమ్స్, సామూహిక చర్చలు వంటి ఎన్నో ఆసక్తికర కార్యకలాపాల్లో పాల్గొని ఉల్లాసంగా గడిపారు. ఈ సందర్భంగా జీటిఏ యూఎస్ఏ అధ్యక్షుడు ప్రవీణ్ కేసిరెడ్డి మాట్లాడుతూ, "ఈ వేడుక కేవలం ఉత్సవంగా మాత్రమే కాదు, మన విలువలు,పరస్పర గౌరవం మనలో ఐక్యతను కలిగిస్...