భారతదేశం, జనవరి 13 -- ఆషికా రంగనాథ్.. నా సామిరంగా సినిమాలో నాగార్జున పక్కన చీరకట్టులో ఎంతో పద్ధతిగా కనిపించిన అమ్మాయి. కానీ భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి మూవీలో మాత్రం ఈ కన్నడ భామ గ్లామర్ డోస్ పెంచేసింది. బికినీలో ఎంట్రీతో మొదలెట్టి సినిమా అంతటా హాట్ హాట్ గా కనిపించింది. ఇప్పుడు భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తిలో ఆషికా గ్లామర్ హాట్ టాపిక్ గా మారింది.

సంక్రాంతి 2026 సందర్భంగా ఇవాళ (జనవరి 13) థియేటర్లలో రిలీజైంది భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి మూవీ. దీనికి మిక్స్ డ్ టాక్ వస్తోంది. కామెడీ అదిరిపోయిందని కొందరు అంటుంటే, రొటీన్ స్టోరీ అని మరికొందరు తీసిపారేస్తున్నారు. అయితే ఈ సినిమాలో మాత్రం ఆషికా రంగనాథ్ లుక్, క్యారెక్టర్ హాట్ టాపిక్ గా మారింది. ఇంటర్నెట్ మొత్తం దీని గురించే చర్చ సాగుతోంది.

భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి సినిమాలో మానస శెట్టి అనే ...