భారతదేశం, మే 9 -- పేరూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల దాడిలో మృతి చెందిన జవాన్ల మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించారు. మొదట ల్యాండ్ మైన్ పేలడం వల్ల చనిపోయారని ప్రచారం జరగగా.. పోస్టుమార్టంలో మాత్రం బుల్లెట్ గాయాల వల్లే చనిపోయినట్లు వెల్లడైనట్లు తెలిసింది. దీంతో అసలు కర్రెగుట్టల్లో ఏం జరిగి ఉంటుందోననే చర్చ మొదలైంది.

మృతి చెందిన గ్రేహౌండ్స్ జవాన్ల డెడ్ బాడీలను గురువారం మధ్యాహ్నం ప్రత్యేక హెలీ క్యాప్టర్ లో వరంగల్ లోని మామునూరు ఎయిర్ పోర్టుకు తరలించగా.. అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి మార్చురీకి తరలించారు. అక్కడ పోస్టుమార్టం అనంతరం వారివారి స్వగ్రామాలను మృతదేహాలను తరలించారు. కాగా డెడ్ బాడీల తరలింపు నుంచి పోస్టుమార్టం దాకా పోలీసులు గోప్యంగానే వ్యవహరించడం గమనార్హం.

మొదట ల్యాండ్ మైన్ పేలడం వల్ల జవాన్లు మృతి చెందారనే ప్రచారం జరగగా.. బుల్లెట్ గ...