భారతదేశం, జనవరి 12 -- తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) పరిమితులను ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) వరకు విస్తరించి. పరిపాలనను మూడు విభాగాలుగా విభజించే దిశగా అడుగులు వేస్తోంది. మరోవైపు సికింద్రాబాద్ పేరుతో ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.

జీహెచ్‌ఎంసీని హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి అనే మూడు కార్పొరేషన్లుగా విభజించాలనే ప్రతిపాదన సికింద్రాబాద్ నివాసితులు, రాజకీయ నాయకుల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. సికింద్రాబాద్ పేరిట కార్పొరేషన్, జిల్లా ఏర్పాటు చేయాలనే వాదనలు వస్తున్నాయి.

భారత రాష్ట్ర సమితి నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్.. ప్రత్యేక సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం డిమాండ్‌ చేస్తున్నారు. సికింద్రాబాద్ లేకుండా హైదరాబాద్‌ను ఊహించలేమని అంటున్నారు. సికింద్రాబాద్ 22...