భారతదేశం, ఏప్రిల్ 19 -- ముఖ్యమైన రాజకీయ ఎత్తుగడలో భాగంగా.. హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం విజయవంతం కావడంతో.. కూటమి విశాఖపట్నం మేయర్ స్థానాన్ని దక్కించుకుంది. కలెక్టర్ ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశాన్ని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించినప్పటికీ.. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 74 ఓట్లు పోలయ్యాయి.

మేయర్‌పై కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 98 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఇటీవల వంశీ కృష్ణ రాజీనామా చేయడంతో.. కౌన్సిల్‌లో 97 మంది కార్పొరేటర్లు మిగిలిపోయారు. వీరిలో 16 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు. 11 మంది కూటమికి చెందినవారు ఉన్నారు.

అయితే.. మలేషియా నుండి తిరిగి వస్తుండగా కూటమి కార్పొరేటర్ భూపతిరాజు సుజాత అదృశ్యం అయ్యారు. దీంతో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. ఆమె గైర్హాజరుకు వైఎ...