భారతదేశం, నవంబర్ 27 -- 2015 గ్రూప్-2 నియామకాల్లో ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. నియామక ప్రక్రియను రద్దు చేసి, ఎంపిక జాబితాను రద్దు చేసిన సింగిల్ బెంచ్ తీర్పును చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) దాఖలు చేసిన అప్పీల్ విచారణ సందర్భంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి. సింగిల్ బెంచ్ తీర్పును టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్‌లో సవాల్ చేయగా.. విచారణ చేపట్టిన న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

అంతకుముందు హైకోర్టు 2015 గ్రూప్-2 ఫలితాలను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. ఎంపిక జాబితాను కొట్టి వేసింది. అక్టోబర్ 24, 2019న జారీ చేసిన ఎంపిక జాబితా చెల్లదని ప్రకటించింది. సాంకేతిక కమిటీ సిఫార్సులు, 2019లో హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు, సాంకేతికత కమిటీ సిఫారసులకు వ్యతిరేకంగా ...