భారతదేశం, సెప్టెంబర్ 17 -- గ్రూప్ 1 ఫలితాలపై ఇటీవల హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మార్చి 10వ తేదీన ఇచ్చిన ఫలితాల ఆధారంగా ప్రకటించిన జనరల్ ర్యాకింగ్ లిస్ట్, మార్కుల జాబితాను హైకోర్టు రద్దు చేసింది. దీనిపై తాజాగా టీజీపీఎస్సీ హైకోర్టుకు వెళ్లింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్‌లో సవాలు చేసింది టీజీపీఎస్సీ. గ్రూప్ 1 ఫలితాలు, ర్యాంకులు రద్దు చేస్తూ.. సెప్టెంబర్ 9న హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది.

గ్రూప్ 1 పరీక్ష వివాదస్పదమైన విషయం తెలిసిందే. గ్రూప్ 1 మూల్యాంకనం అవకతవకలు జరిగాయని హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. పరీక్షలు రద్దు చేయాలని కొందరు, ఎంపిక ప్రక్రియ పూర్తయి ఉత్తర్వుల దశలో ఉన్న పరీక్షలను రద్దు చేయకూడదు అంటూ మరికొందరు హైకోర్టుల వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.

పరీక్షల సమయంలో జెల్ ప...