Telangana,hyderabad, సెప్టెంబర్ 11 -- గ్రూప్-1 అభ్యర్థుల ఆకాంక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం వమ్ము చేసిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల ఆశలపై కాంగ్రెస్ సర్కార్ నీళ్లు చల్లిందన్న ఆయన.. అంగట్లో కొలువులను అమ్ముకుందని ఆరోపించారు. పలువురు మంత్రులే నేరుగా కోట్లాది రూపాయలు డిమాండ్ చేసిన అంశంపై నిజాలు నిగ్గు తేల్చాలన్నారు.

"అభ్యర్థులు చేస్తున్న ఆరోపణలపైన సత్యాలు ప్రజల ముందుకు రావాల్సిన అవసరం ఉంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం గ్రూప్-1 పరీక్ష మళ్లీ నిర్వహించాలి. పరీక్షల అవకతవకలపై జుడీషియల్ విచారణ చేపట్టాలి. గ్రూప్ వన్ అక్రమాలపై చర్చించడానికి ప్రత్యేక అసెంబ్లీ సెషన్ నిర్వహించాలి" అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

గ్రూప్-1 పోస్టుల కోసం భారీగా డబ్బులను డిమాండ్ చేసినట్లు పలువురు విద్యార్థులు మీడియాలో చేస్తున్న ఆరోపణలపైన కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ...