Telangana,hyderabad, సెప్టెంబర్ 12 -- గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయాలని. లేదంటే పరీక్షలను రద్దు చేయాలని హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో గ్రూప్ 1 నియామాకాల ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చినట్లు అయింది. అయితే ఈ తీర్పును సింగిల్ బెంచ్ ధర్మాసనం ఇవ్వగా. ఈ నిర్ణయాన్ని సవాల్ చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది.

హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్‌ బెంచ్‌లో అప్పీలు చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రత్యేక సమావేశం నిర్వహించగా. కోర్టు తీర్పుతో పాటు పలు అంశాలపై లోతుగా చర్చించింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం రీవాల్యూయేషన్‌ చేస్తే మరిన్ని సాంకేతిక సమస్యలు రావొచ్చని అభిప్రాయపడింది. మూల్యాంకనం, మార్కులతో పాటు ఇతర అంశాల్లో ఎలాంటి లోపాలు లేవనే వాదనను బలంగా వినిపించాలని నిర్ణయించింది. వా...