భారతదేశం, నవంబర్ 10 -- హైదరాబాద్‌ నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో గ్రూప్ 3 సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ప్రారంభమైంది. గ్రూప్ 3 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాలను టీజీపీఎస్సీ పరిశీలిస్తోంది. ఈ ప్రక్రియ నవంబర్ 26వ తేదీ వరకు నడుస్తుంది. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరిశీలన ఉంటుంది. ఈ మేరకు టీజీపీఎస్సీ వివరాలు వెల్లడించింది.

సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్ నెంబర్లు ఇప్పటికే www.tgpsc.gov.in లో ఉన్నాయి. డౌట్ ఉంటే ఓసారి చెక్ చేసుకోండి. ధ్రువపత్రాల పరిశీలనకు వచ్చే అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తోపాటుగా రెండు జిరాక్స్ సెట్లు కూడా తెచ్చుకోవాలి. అంతకుముందు మీ వెరిఫికేషన్ ఎప్పుడు ఉందో అధికారిక వెబ్‌సైట్‌లో షెడ్యూల్ చూసుకోవాలి. దాని ప్రకారమే వెరిఫికేషన్ కేంద్రానికి హాజరు కావాల...