భారతదేశం, మే 19 -- విజయనగరం జిల్లాకు చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ ఇంజనీరింగ్‌ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. అతని తండ్రి పోలీస్ శాఖలో ఏఎస్సైగా పనిచేస్తున్నాడు. అతని సోదరుడు కూడా అదే డిపార్ట్‌మెంట్‌లో ఉన్నాడు.తండ్రి సోదరుడి బాటలో ప్రభుత్వ ఉద్యోగంలో చేరతాడని కుటుంబ సభ్యులు భావించారు.

ఉద్యోగ ప్రయత్నాలతో పాటు గ్రూప్‌ 2 పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు శిక్షణ కోసం కుటుంబ సభ్యులు సిరాజ్‌ను హైదరాబాద్‌ పంపించారు. ఆన్‌లైన్‌లో ఉగ్రవాద ప్రచారాలకు ఆకర్షితుడైన సిరాజ్‌ హైదరాబాద్‌కు చెందిన మరో యువకుడితో కలిసి ఉగ్రవాద కార్యకలాపాలు ప్రారంభించాడు. సౌదీ నుంచి ఐసిస్‌ మార్గదర్శకాలతో అలజడి సృష్టించేందుకు బాంబుల తయారీ మొదలు పెట్టాడు.

విజయనగరం జిల్లాకు చెందిన సిరాజ్‌, సికింద్రాబాద్‌ బోయిగూడకు చెందిన చెందిన సయ్యద్ సమీర్‌లను ఉగ్రవాద కార్యకలాపాలపై పోలీసులు అరె...