భారతదేశం, ఏప్రిల్ 29 -- తెలంగాణ గ్రూప్‌ 1నియామకాలపై హైకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. గ్రూప్‌ 1 ఇంటర్వ్యూల్లో నెగ్గిన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను సవాలు చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. నియామక ప్రక్రియ నిలిపివేయాలని 20మంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ కొనసాగించవచ్చని, తుది తీర్పుకు లోబడి నియామకాలు ఉంటాయని హైకోర్టు ఆదేశించింది.

హైకోర్టు సింగల్ బెంచ్‌ ఆదేశాలపై టీజీపీఎస్సీ డివిజన్‌ బెంచ్‌లో సవాలు చేసింది. గ్రూపు-1 నియామకాలను పూర్తి చేయడంపై ఏప్రిల్ 17న సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలంటూ హైకోర్టు డివిజన్ బెంచిలో అప్పీలు చేసింది. దీనిపై నేడు సీజే విచారణ జరుపనున్నారు.

గ్రూప్‌1 అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిందని, నియామక ప్రక్రియ ముగింపు దశలో ఉండగా సింగిల్ జడ్జి ఉత్తర్వు...