భారతదేశం, డిసెంబర్ 21 -- జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తిరుపతి నగరంలో పర్యటించారు. ఏపీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో ఎస్.ఆర్ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన ఎనర్జీ ఎగ్జిబిషన్‌కు హాజరైన మంత్రి, విద్యార్థులు రూపొందించిన నూతన ఆవిష్కరణలను ఆసక్తిగా తిలకించారు. ఇంధన పొదుపు, గ్రీన్ ఎనర్జీ, స్మార్ట్ టెక్నాలజీలపై ఆధారపడి రూపొందించిన ప్రాజెక్టుల వివరాలను విద్యార్థులు స్వయంగా మంత్రికి వివరించారు. విద్యార్థుల్లో కనిపించిన సృజనాత్మకతను మంత్రి ప్రశంసిస్తూ, భవిష్యత్తు ఇంధన రంగానికి ఇవి దిశానిర్దేశకంగా నిలుస్తాయని అన్నారు.

ఎగ్జిబిషన్ సందర్భంగా పీఎం సూర్యఘర్, కుసుమ్, స్మార్ట్ మీటర్ల ప్రాజెక్టులను మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ పథకాలకు మరింత విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులకు సూచించారు. ...