Hyderabad, జూన్ 18 -- మలయాళం థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఊహించని ట్విస్టులు, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో అలరిస్తాయి. అలా ఇప్పుడు కొల్లా (Kolla) అనే మరో మూవీ తెలుగులో రాబోతోంది. థియేటర్లలో రిలీజైన రెండేళ్లకు తెలుగులో ఓటీటీలోకి వస్తున్న ఈ మూవీ ట్రైలర్ ను బుధవారం (జూన్ 18) ఈటీవీ విన్ ఓటీటీ రిలీజ్ చేసింది. ఆ ట్రైలర్, మూవీ విశేషాలేంటో ఇక్కడ చూడండి.

కొల్లా మూవీ 2023లోనే రిలీజైనా.. తెలుగులో మాత్రం ఇప్పుడు వస్తోంది. ఈ విషయాన్ని ఒక రోజు ముందే ఈటీవీ విన్ ఓటీటీ వెల్లడించింది. గురువారం (జూన్ 19) నుంచి మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు కూడా తెలిపింది. ఇక తాజాగా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేసింది. అందులో ఇద్దరు అమ్మాయిలు ఓ ఊరికి వస్తారు. అక్కడ ఓ బ్యూటీ పార్లర్ తెరవడానికి ప్లాన్ చేస్తారు.

తమ మాటతీరు, అందంతో అక్కడి వాళ్లను త్వరగానే ఆకర్షిస్తారు. అయిత...