భారతదేశం, డిసెంబర్ 4 -- చిత్తూరులో కొత్త డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్(డీడీఓ) కార్యాలయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రారంభించారు. వివిధ జిల్లాల్లో అదనంగా 77 డీడీఓ కార్యాలయాలను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా పౌరులకు మెరుగైన సౌకర్యాలను అందించడంలో గ్రామీణాభివృద్ధి శాఖ పాత్రను పవన్ కల్యాణ్ నొక్కి చెప్పారు.

'సమాజానికి సేవ చేసే, ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు ఇచ్చే 77 డీడీఓ కార్యాలయాలను ప్రారంభించడం నాకు సంతోషంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 10,000 మందికి పైగా ఉద్యోగుల పదోన్నతులు ఉన్నాయి. పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో ఐటీ విభాగాన్ని తీసుకొస్తాం.' అని పవన్ కల్యాణ్ అన్నారు.

ప్రజలకు మరింత చేరువయ్యేలా పంచాయతీరాజ్ వ్యవస్థను తయారు చేస్తున్నట్టుగా పవన్ కల్యాణ్ చెప్పారు. డీడీఓ కార్యాలయాల ద్వారా సంక్షేమ, అభివృ...