భారతదేశం, మే 21 -- ఏపీలో సచివాలయాలను క్రమబద్దీకరించాలనే ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో జరుగుతున్న ప్రచారాలపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి వివరణ ఇచ్చారు. సచివాలయాలను ఏబీసీ క్యాటగిరీలుగా విభజించి సిబ్బంది సర్దుబాటుకు చర్యలు చేపట్టినట్టు వివరించారు.

సచివాలయాల్లో సిబ్బందిని సర్దుబాటు చేశాకే సచివాలయాల సిబ్బంది బదిలీలు చేపడతామని స్పష్టత ఇచ్చారు. సచివాయాల పనితీరు నిరంతరం పర్యవేక్షణకు మూడు అంచెల విధానం అనుసరిస్తామన్నారు.

రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులెవరినీ తొలగించమని వాటి సంఖ్యను తగ్గించే ఆలోచన ప్రభుత్వానికి లేదని దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర గ్రామ,వార్డు సచివాలయాలు,సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాలవీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు.

గ్రామ వార్డు సచివాలయాల రేషన లైజేషన్ కు ఇటీవల ప్రభుత్వం జిఓ జారీ చేసిందని ...