Telangana, సెప్టెంబర్ 4 -- గ్రామ‌స్ధాయిలో రెవెన్యూ వ్యవస్థ పున‌రుద్ధ‌రణ, బ‌లోపేతం చేసే దిశగా తెలంగాణ సర్కార్ మరో అడుగు వేయనుంది. శుక్రవారం (సెప్టెంబర్ 05) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గ్రామ పాలనాధికారులకు (జి.పి.వో) నియామక పత్రాలను అందజేయనున్నారు.

రైతాంగానికి మ‌రింత‌ మెరుగైన సేవ‌లందించడానికి గ్రామ‌స్ధాయిలో రెవెన్యూ వ్య‌వ‌స్ధ‌ను పున‌రుద్ధ‌రిస్తూ బ‌లోపేతం చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగానే జీపీవోలను తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. వీరి నియామాకాలకు సంబంధించి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాజాగా ప్రకటన విడుదల చేశారు.

ఈనెల 5వ తేదీ శుక్రవారం సాయంత్రం 4 గంట‌ల‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గ్రామ‌పాల‌నాధికారులకు (జీపీవో) మాదాపూర్ లోని హైటెక్స్‌లో నియామ‌క ప‌త్రాలను అంద‌జేస్తామని...