భారతదేశం, నవంబర్ 27 -- తెలంగాణలో స్థానిక ఎన్నికల నగారా మోగింది. దీంతో పల్లెల్లో ఎన్నికల వాతావరణం మొదలైంది. ఇప్పటికే షెడ్యూల్ ఖరారు కాగా... ఇవాళ్టి నుంచి మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.

రాష్ట్రంలో ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం కూడా నిర్ణయించింది. మొత్తం మూడు విడతల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలు జరుపుతారు. అయితే కీలకమైన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి పోటీ చేసే వారికి కొన్ని అర్హతలుంటాయి. అంతేకాకుండా కొందరు పోటీ చేయటానికి వీలుండదు. ఆ వివరాలెంటో ఇక్కడ తెలుసుకోండి...

ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 564 మండలాల్లో గల 12,728 పంచాయతీలు, 1,12,242 వార్డులకు ఎన్నికలను నిర్వహిస్తారు. పలు కేసుల్లో జారీ...