భారతదేశం, నవంబర్ 28 -- పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు రాష్ట్ర హైకోర్టు నిరాకరించింది. రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 46పై అభ్యంతరంపై వ్యక్తం చేస్తూ పలు బీసీ సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. అత్యంత వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు కేటాయించాలని పిటిషన్ లో ప్రస్తావించాయి. దీనిపై విచారించిన హైకోర్టు.. ప్రస్తుత దశలో స్టే విధించలేమని స్పష్టం చేసింది.

ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ మొదలైందని. ఇలాంటి దశలో స్టే ఇవ్వలేమని ధర్మాసనం పేర్కొంది. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యాక ఎందుకు సవాల్‌ చేస్తున్నారని ప్రశ్నించింది. ఇరువైపు వాదనలు విన్న కోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. స్టే ఇవ్వకపోవటంతో.. ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందుకు సాగనున్నాయి.

Published by HT Digital Cont...