భారతదేశం, నవంబర్ 22 -- గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం శనివారం జీవోను విడుదల చేసంది. సర్పంచ్‌, వార్డు సభ్యుల రిజర్వేషన్ల విధివిధానాలు ఖరారు చేసింది. 50 శాతానికి మించకుండా రిజర్వేషన్లపై మార్గదర్శకాలు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ రిజర్వేషన్‌లను రొటేషన్‌ పద్ధతిలో అమలు చేయాలని జీవోలో పేర్కొంది. వంద శాతం ఎస్టీలు ఉన్న గ్రామాల్లో సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలు అన్నీ ఎస్టీలకే రిజర్వ్‌ అవుతాయని స్పష్టం చేసింది.

వార్డు మెంబర్లకు 2024 కుల సర్వే ఆధారంగా, సర్పంచులకు 2011 సెన్సస్ ఆధారంగా( బీసీ సర్పంచ్ అభ్యర్థులకు 2024 కుల సర్వే) రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు జీవోలో ప్రభుత్వం పేర్కొంది. రొటేషన్ పద్ధతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.

ఇక బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ తె...