భారతదేశం, నవంబర్ 22 -- రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. డెడికేటెడ్‌ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా మండలాల వారీగా బీసీ రిజర్వేషన్లు ఖరారవుతున్నాయి. బీసీ రిజర్వేషన్లు 23 శాతం చొప్పున ఉండేలా ఇప్పటికే డెడికేటెడ్‌ కమిషన్‌ ఒక నివేదికకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇప్పటికే పలువురు మంత్రులు సంతకాలు కూడా చేశారు.

ప్రభుత్వం సిద్ధం చేసిన నివేదికను అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపించారు. కలెక్టర్లు దాన్ని పరిశీలించి మండలాలకు పంపించారు. దీని ప్రకారం మండల స్థాయిలో సర్పంచ్‌లు, వార్డు స్థానాలకు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కసరత్తు పూర్తయింది.

ఇవాళ బీసీ రిజర్వేషన్ల ఖరారు ఎలా చేయాలన్న దానిపై ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉంది. ఆదివారం నాటికి ఆ జాబితాలను అధికారికంగా ఖరారు చేసి అన్ని జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి స...