భారతదేశం, నవంబర్ 28 -- రాష్ట్రంలో మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి రోజు 5,063 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో సర్పంచి స్థానాలకు 3,242, వార్డు పదవులకు 1,821 నామినేషన్లను సమర్పించారు.

మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నవంబర్ 29వ తేదీ వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. నవంబర్ 30వ తేదీ నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుంది. వీటిపై డిసెంబరు 1న వినతులను స్వీకరిస్తారు. డిసెంబర్ 2వ తేదీన ఆయా దరఖాస్తులను పరిష్కరిస్తారు. డిసెంబర్ 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు ఛాన్స్ ఉంటుంది. అదే రోజు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు.

నామినేషన్లు వేసే అభ్యర్థులు కొత్త బ్యాంక్ అకౌంట్లు తీస్తున్నారు. దీంతో బ్యాంకుల వద్ద సందడి వాతావరణం కనిపిస్తోంది. ఎన్నికల వ్యయ పరిశీలన కోసం అభ్యర్థులకు ...