భారతదేశం, డిసెంబర్ 1 -- నారాయణపేట జిల్లా మక్తల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. రూ.200 కోట్లతో సమీకృత గురుకుల పాఠశాల సముదాయ భవనాలకు, మక్తల్-నారాయణపేట మధ్య నాలుగు లైన్ల రోడ్డు, మక్తల్ క్రీడాభవనంతోపాటుగా మరికొన్ని అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. దానికంటే ముందు వనపర్తి జిల్లా ఆత్మకూరులోనూ పర్యటించిన రేవంత్ రెడ్డి రూ.151.92 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం మక్తల్ పట్టణ కేంద్రంలో ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాల బహిరంగ సభలో సీఎం మాట్లాడారు.

'ఉమ్మడి రాష్ట్రంలో, ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నిర్లక్ష్యానికి గురైంది. కేసీఆర్ హయాంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను పట్టించుకోలేదు. బీఆర్ఎస్ పాలనలో జిల్లాకు తీరని అన్యాయం చేశారు. మక్తల్ నుంచి ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు ప్రారంభించడం చాలా సంతోషంగ...