భారతదేశం, జనవరి 11 -- పేదలకు ఉపాధి కల్పించడంతోపాటు... గ్రామాల్లో ఆస్తులను సృష్టించేలా వికసిత్ భారత్ జీ రామ్ జీ పథకాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం గత డిసెంబర్ నెలలో మహాత్మగాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో తెచ్చిన వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అజీవికా మిషన్(గ్రామీణ్)- వీబీ జీ రామ్ జీ పథకంపై ప్రజలకు, లబ్దిదారులకు వివరించేలా కార్యాచరణ సిద్దం చేయాలన్నారు.

శనివారం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్, జనసేన తరపున మంత్రి కందుల దుర్గేష్ భేటీ అయ్యారు. ఈ భేటీలో జీ రామ్ జీ పథకం అమలు పైనా... ఈ పథకం ద్వారా రాష్ట్రానికి... పేదలకు ఎలాంటి మేలు జరుగుందన్న అంశంపై చర్చించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..."కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా గ్...