భారతదేశం, అక్టోబర్ 30 -- ఆంధ్రప్రదేశ్‌లో మెుంథా తుపాను ప్రభావంతో భారీగా పడింది. దీంతో చాలా ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బందులు అయ్యాయి. తుపానుతో వాగులు, వంకల్లో వరద నీరు భారీగా ప్రవహించింది. ఇదే సమయంలో బాపట్ల జిల్లాలో ఓ గర్భిణికి పురిటినొప్పులు వచ్చాయి. అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేకపోవడంతో పోలీస్ జీపులో ఆసుపత్రికి తీసుకెళ్లారు. పూర్తి వివరాళ్లోకి వెళ్తే..

మెంథా తుపాను సమయంలో చాలా గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి. బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం కొణికి గ్రామ పంచాయతీలోని కట్టవారిపాలెం గ్రామంలో 24 ఏళ్ల కీర్తికి పురిటినొప్పులు వచ్చాయి. మెుంథా తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లాయి. అత్యవసర సేవలకు పూర్తిగా అంతరాయం కలిగింది. 108 అంబులెన్స్ గ్రామాన్ని చేరుకోలేకపోయింది.

మెడికల్ ఎమర్జెన్సీ గురించి సమాచారం అందుకున్న ఎస్ఐ సు...