భారతదేశం, డిసెంబర్ 13 -- తల్లాడ సాయికృష్ణ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా "మ్యాజిక్ మూవ్‌మెంట్స్" (మీరు అనుకున్నది కాదు) అనేది క్యాప్షన్. ఆకట్టుకునే క్యాప్షన్‌తో వస్తున్న మ్యాజిక్ మూవ్‌మెంట్స్ సినిమాకు ప్రముఖ దర్శకుడు కె. దశరథ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రాన్ని శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్, శ్రీ లక్ష్మి శ్రీనివాస ఫిలిమ్స్ బ్యానర్స్‌పై తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. వెంకట్ దుగ్గిరెడ్డి సహ నిర్మాతగా ఉన్నారు. ప్రస్తుతం "మ్యాజిక్ మూవ్‌మెంట్స్" (మీరు అనుకున్నది కాదు) చిత్రీకరణ తుది దశలో ఉంది.

ఈ నేపథ్యంలో తాజాగా శుక్రవారం (డిసెంబర్ 12) హైదరాబాద్‌లో "మ్యాజిక్ మూవ్‌మెంట్స్" (మీరు అనుకున్నది కాదు) సినిమా టైటిల్ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టెక్నిషియన్స్, సినిమా టీమ్ అంతా హీరో తల్లాడ సాయికృష్ణపై కామెంట్స్ చేస్తూ ప్ర...