భారతదేశం, నవంబర్ 26 -- ఆసియా ఖండంలో ఎక్కువగా కనిపించే క్యాన్సర్లలో జీర్ణాశయం లేదా కడుపులో క్యాన్సర్ (గ్యాస్ట్రిక్ క్యాన్సర్) ఒకటి. భారతదేశంలో అయితే, సాధారణంగా వచ్చే క్యాన్సర్లలో ఇది ఏడవ స్థానంలో ఉంది. ప్రతి సంవత్సరం సుమారు 64 వేల కొత్త కేసులు బయటపడుతున్నాయి. ఈ క్యాన్సర్ ఆడవారిలో కంటే మగవారిలోనే ఎక్కువగా కనిపిస్తోంది. ఇది చాలా నెమ్మదిగా, సైలెంట్‌గా మొదలై, గుర్తించే సమయానికి అడ్వాన్స్‌డ్ స్టేజ్‌కి చేరుకుంటుంది. అందుకే, దీనికి కారణాలు, ముందుగానే తెలియజేసే సంకేతాలు, నివారణ చర్యల గురించి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవడం అత్యవసరం.

మన రోజువారీ అలవాట్లే కడుపులో క్యాన్సర్ రిస్క్‌ను పెంచే ప్రధాన కారకాలు. అందులోనూ మరీ ముఖ్యంగా మన ఆహారపు అలవాట్లు కీలక పాత్ర పోషిస్తాయి.

ప్రిజర్వేటివ్స్, ఉప్పు అధికంగా: పులుపు, ఉప్పు ఎక్కువగా వేసిన ఆహారం, కాల్చిన (బార్బ...