భారతదేశం, జనవరి 5 -- రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కే సినిమాలకు మంచి క్రేజ్ ఉంటోంది. అలా నిజ జీవిత సంఘటనలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోన్న లేటెస్ట్ తెలుగు సినిమానే రిమ్‌జిమ్. 1990ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

రిమ్‌జిమ్ సినిమాకు హేమ సుందర్ దర్శకత్వం వహించారు. సచేతన్ రెడ్డి, డా. మానస, శ్రీనివాసరావు నిర్మాణంలో రూపొందించారు. ఈ రిమ్‌జిమ్' మూవీకి 'అస్లీదమ్' అనేది ట్యాగ్‌లైన్. స్నేహం, ప్రేమ కథగా రూపొందిన ఈ రిమ్‌జిమ్ మూవీ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

ఈ సందర్భంగా దర్శకుడు హేమ సుందర్ మాట్లాడుతూ.. రిమ్‌జిమ్ సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వచ్చిందని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నామని తెలిపారు. ప్రేక్షకులందరికీ నచ్చేలా సినిమాను తీర్చిదిద్దామని రిమ్‌జిమ్ డైరెక్టర్ హే...