Telangana, జూన్ 18 -- రాష్ట్రంలో గో సంర‌క్ష‌ణ‌కు స‌మ‌గ్ర విధానం రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లోని విధానాల‌ అధ్య‌య‌నానికి ముగ్గురు అధికారుల‌తో ఒక క‌మిటీని సీఎం నియ‌మించారు. ప‌శు సంవ‌ర్ధ‌క శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌బ్య‌సాచి ఘోష్‌, దేవాదాయ శాఖ ముఖ్య‌ కార్య‌ద‌ర్శి శైల‌జా రామ‌య్య‌ర్, వ్య‌వ‌సాయ శాఖ కార్య‌ద‌ర్శి ర‌ఘునంద‌న్‌రావు ఈ కమిటీలో చోటు కల్పించారు.

రాష్ట్రంలో గో సంర‌క్ష‌ణ‌పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం సాయంత్రం త‌న నివాసంలో స‌మీక్ష నిర్వ‌హించారు. మ‌న సంస్కృతిలో గోవుల‌కు ఉన్న ప్రాధాన్యం, భ‌క్తుల మ‌నోభావాలను దృష్టిలో ఉంచుకోవ‌డంతో పాటు గోవుల సంర‌క్ష‌ణే ప్ర‌ధానంగా విధానాల రూప‌క‌ల్ప‌న ఉండాల‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. భ‌క్తులు గోశాల‌ల‌కు పెద్ద సంఖ్య‌లో గోవులు దానం చేస...