Tirupati,andhrapradesh, ఏప్రిల్ 17 -- టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలకు సంబంధించి ఇటీవలే టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గత మూడు మాసాలుగా గోశాలలో 100కుపైగా గోమాతలు మృత్యువాత పడ్డాయని.. ఈ విషయాన్ని దాచిపెట్టారని అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారాయి.

భూమన వ్యాఖ్యలను ఓవైపు తిరుమల తిరుపతి దేవస్థానం తీవ్రంగా ఖండించింది. ఇటీవల గోవులు మృతి చెందాయంటూ కొద్దిమంది సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం వాస్తవం కాదని తెలిపింది. మృతి చెందిన గోవులు ఫొటోలు టీటీడీ గోశాలకు సంబంధించినవి కావని.. దురుద్దేశంతో కొన్ని ఫొటోలను టీటీడీ గోశాలలో మృతి చెందినవిగా చూపించి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేస్తున్న ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. ఇలాంటి అవాస్తవ ప్రచారాన్ని నమ్మవద్దని కోరింది.

ఇదిలా ఉంటే భూమన...