Hyderabad, జూన్ 20 -- గోవు మనందరికీ ఆరాధ్యదైవం. గోవుని నిత్యం ఏదో సందర్భంలో మనం పూజిస్తూనే ఉంటాం. గోవును మనం మాతగా పిలుచుకుంటాం. మన ఇంట ఎటువంటి శుభకార్యమైనా గోమాత ప్రస్తావన వచ్చి తీరుతుంది. అంతటి గోమాత గొప్పతనాన్ని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

గోవు పాదాలు పితృదేవతలు. గొలసి తులసీమార్గాన వెలసిన వల జ్ఞానం. గంగ నాథనీడు ఉన్నాడు. గద ధారముంది. మొగము జ్యేష్ఠము. కన్నులు అగ్రదేవతలు. చెవులు శంఖనాదములు. మూపురం విష్ణుదేవుని బోలు. బొడ్డు తామర కమలాల బోలు. నడుము నారదుని బోలు.

పక్కలు పరమేశ్వరుని బోలు. పిక్కలు పిడుగంటిని బోలు. తోలు యముణ్ణి బోలు. తోక వింజామర బోలు. కరివి కామాక్షిని బోలు. పొదుగు పుండరీకాక్షుని బోలు. సన్ను కట్టు సప్తసాగరాలు. పాలు పంచామృతాలు. పంచామృతాలలో ఉన్న భాగ్యవతి. భాగ్యవతిలో ఉన్...