Andhrapradesh, జూలై 26 -- గోవా గవర్నర్ గా పూసపాటి అశోక్ గజపతిరాజు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు.రాజ్‌భవన్‌ బంగ్లా దర్బార్‌ హాల్‌లో ఈ కార్యక్రమం జరిగింది. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే. అశోక్‌ గజపతిరాజుతో ప్రమాణం చేయించారు.

ప్రమాణ స్వీకారం అనంతరం కొత్త గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ. ప్రభుత్వానికి సహకరించాలని, ప్రపంచ వేదికపై భారత్ ఎదుగుదలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

'గోవాకు వచ్చి. దేశానికి, ముఖ్యంగా గోవా ప్రజలకు సేవ చేయడానికి భారత రాజ్యాంగంపై ప్రమాణం చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాంటి పదవిలో ఇది నా మొదటి నియామకం. కానీ రాజకీయ నిర్మాణంలో నాకు సుదీర్ఘ అనుభవం ఉంది. మరిన్ని అనుభవాలతో మరింత సుసంపన్నం కావాలని ఆశిస్తున్నాను. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని విధంగా భారత్ ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వంతో కలిసి పని...