Hyderabad, జూలై 30 -- ఒకప్పుడు వాళ్లు తెలుగు, తమిళ ఇండస్ట్రీలను ఏలిన నటీనటులు. తమ గ్లామర్‌తో అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడందరూ తమ 50లు, 60ల దగ్గరగా ఉన్నారు. అలాంటి వాళ్లంతా ఒకచోట చేరితే. 90వ దశకంలో టాలీవుడ్, కోలీవుడ్‌లలో ఒక ఊపు ఊపిన ఎంతోమంది నటీనటులు, దర్శకులు ఈమధ్యే గోవాలో కలిశారు.

అందరూ తెలుపు రంగు దుస్తులు ధరించి జరుపుకున్న ఈ రీ యూనియన్ ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో జగపతి బాబు, ప్రభుదేవా, సిమ్రన్, మీనా వంటి నటులతోపాటు, దర్శకులు శంకర్, కేఎస్ రవికుమార్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు.

గోవాలో 90ల్లోని ఈ స్టార్స్ తిరిగి కలిసిన ఫొటోలను ప్రముఖ నటి మీనా షేర్ చేసింది. గోవా రీ యూనియన్ ఫోటోలు చాలా వాటిని ఆమె పంచుకుంది. "జ్ఞాపకాలు సృష్టించుకున్నాం. 90ల రీ యూనియన్" అని రాశారు. ఇందులో పాల్గొన్న చాలా మంది...