భారతదేశం, డిసెంబర్ 4 -- అత్యవసరంగా డబ్బులు అవసరమైతే ఠక్కున గుర్తుకువచ్చేది గోల్డ్ లోన్. బంగారం రుణాలలో దక్షిణాది రాష్ట్రాలు టాప్‌లో ఉన్నాయి. మిగతా రుణాలతో పోల్చుకుంటే గోల్డ్ లోన్ రావడం చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కువగా పత్రాలు అవసరం ఉండవు. డబ్బులు కూడా వెంటనే పడిపోతాయి. దీంతో బంగారం రుణాలకు జనాలు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. ఈ రుణాల్లో తెలంగాణ, ఏపీ వాటా కూడా ఎక్కువే ఉందని నివేదికలు చెబుతున్నాయి.

సెప్టెంబర్ 2025 నాటికి భారతదేశంలో మొత్తం బంగారు రుణాలు రూ.14.5 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దక్షిణ భారత రాష్ట్రాలు మార్కెట్‌లో 76.55 శాతం వాటా కలిగి ఉన్నాయి. రూ.4.9 లక్షల కోట్లతో తమిళనాడు అగ్రస్థానంలో ఉంది, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, కేరళ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. జాతీయ బంగారు రుణ మార్కెట్‌లో దక్షిణాది రాష్ట్రాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి

రూ.14...