భారతదేశం, జనవరి 12 -- హాలీవుడ్ అవార్డుల సందడి మొదలైంది. లాస్ ఏంజిల్స్‌లోని బెవర్లీ హిల్స్‌లో ఆదివారం (జనవరి 11) రాత్రి (స్థానిక కాలమానం ప్రకారం) 83వ వార్షిక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2026 వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ గోల్డెన్ గ్లోబ్స్ వేడుకల్లో గ్లోబల్ స్టార్, భారతీయ నటి, వారణాసి హీరోయిన్ ప్రియాంకా చోప్రా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఈ ఏడాది గోల్డెన్ గ్లోబ్స్ 2026కి అవార్డు ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా విచ్చేసింది. అయితే ప్రియాంక తన భర్త, ప్రముఖ సింగర్ నిక్ జోనాస్‌తో కలిసి గోల్డెన్ గ్లోబ్స్ 2026 రెడ్ కార్పెట్‌పై రొమాంటిక్‌గా మెరిశారు. ఇద్దరు కలిసి రెడ్ కార్పెట్‌పై రొమాంటిక్ పోజుతో అందరిని అట్రాక్ట్ చేశారు.

నీలి రంగు ఆఫ్-షోల్డర్ గౌనులో ప్రియాంక చోప్రా దేవకన్యలా మెరిసిపోతుంటే, నిక్ జోనాస్ బ్లాక్ టక్సేడోలో ఎంతో స్టైలిష్‌గా కనిపించారు. ...