భారతదేశం, జూలై 1 -- గోదావరి, కృష్ణా జలాలపై తెలంగాణకు నీటి కేటాయింపులు, హక్కుల సాధన కోసం స్పష్టమైన విధానంతో ముందుకు వెళతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు పక్కాగా నీటి కేటాయింపులు జరిపిన తర్వాతే మిగులు, వరద జలాలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. మిగులు, వరద జలాల్లోనూ రెండు రాష్ట్రాల మధ్య నిష్పత్తి ప్రకారం కేటాయింపులు జరగాలని స్పష్టం చేశారు.

గోదావరి - కృష్ణా బేసిన్‌లో తెలంగాణ నీటి వాటా అన్న అంశంపై పూలె ప్రజాభవన్ లో ప్రజా ప్రతినిధులకు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు హాజరయ్యారు.

జల వివాదాలపై చారిత్రక పరిణామాలు, రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను ఇందులో పేర్కొన్నారు. తెలంగాణల...