భారతదేశం, జనవరి 11 -- గోదావరి నదీ జల ప్రవాహానికి దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ సముద్రంలో వృథాగా కలిసిపోతున్న 3000 టీఎంసీల నీటిలో 200 టీఎంసీలు నీటిని వాడుకుంటే తప్పేంటి అని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆవేదన చెందారు. తోటి తెలుగు రాష్ట్రానికి స్నేహ హస్తం అందిస్తుంటే, వారు ఏపీకి అన్యాయం జరిగేలా కోర్టుకి వెళ్లడం విచారకరమన్నారు.

పోలవరం-బనకచర్ల/నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుపై సోమవారం సుప్రీం కోర్టులో వాయిదా నేపథ్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ అధికారులు, న్యాయవాదులతోనూ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించాలని లీగల్ టీమ్‌కు మంత్రి నిమ్మల సూచించారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని రికార్డులు, లీగల్ టీమ్‌కు అందించాలని ఇరిగేషన్ ఉన్నతాధికారులకు చెప్పారు.

ఏటా ...